ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు పుల్వామా ! ఫిబ్రవరి 14న సీ ఆర్ పి ఎఫ్ జవానులపై ఉగ్ర దాడితో ఇప్పుడు పుల్వామా వార్తల్లోకి వచ్చింది . జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఓ జిల్లా కేంద్రం పుల్వామా . జమ్మూ కాశ్మీర్ కు శ్రీనగర్ కు మధ్యన వుంది పుల్వామా . చలికాలంలో జమ్మూ రాజధానిగాను , వేసవికాలంలో శ్రీనగర్ రాజధానిగాను ఉంటుంది భారత సైనికులు 78 వాహనాల్లో 2547 మంది జమ్మూ నుంచి ఉదయం 3. 30 గంటలకు శ్రీనగర్ కు బయలుదేరారు.
జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య దూరం 269 కిలో మీటర్లు . పుల్వామా నుంచి శ్రీనగర్ కేవలం 36 కిలోమీటర్లే. ఈ ఘటన అవంతీపుర దగ్గర జరిగింది . ఎప్పుడూ ఇంత మంది జవానులు ఒకేసారి బయలు దేరిన సందర్భాలు లేవు . సెలవులనుంచి ఎక్కువమంది జవానులు వచ్చి విధుల్లో చేరారు . అందరు కలసి ఉత్సాహంతో వెడుతున్నారు . జమ్మూ కాశ్మీర్ హైవే లో పుల్వామా జిల్లాలోని అవంతీపురా సమీపంలోకి కాన్వాయ్ వచ్చింది . అప్పుడు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మానవ బాంబు అదిల్ అహ్మద్ దార్ స్కార్పియో తో వాహనం శ్రేణి మధ్యలోకి వచ్చి తనని తాను పేల్చుకున్నాడు .
అక్కడికక్కడే 40 మంది జవానులు చనిపోయారు . అదిల్ అహ్మద్ పుల్వామా జిల్లాలోని గుండి బాగ్ కు చెందినవాడు . సంఘటన జరిగిన అవంతీపురాకు శ్రీనగర్ 34 కిలోమీటర్ల దూరం లో వుంది . గత మూడు రోజుల నుంచి భారత సైన్యం పుల్వామాలో మోహరించి వుంది . పుల్వామా ఉగ్రమూకలకు అడ్డాగా మారిందని అనుమానం వచ్చి సైన్యం మారువేసి ఉగ్రవాదులను మత్తు పెడుతోంది . భారత సైనికులపై దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఘాజీ రషీద్ ను భద్రతా దళాలు కాల్చివేశాయి . సైనికుల పై దాడి జరిగిన ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరములోనే ఈ ఎన్ కౌంటర్ జరిగింది .
1979లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకొత్త జిల్లాగా పుల్వామా అవతరించింది . పరిపాలనా సౌలభ్యం కోసం , శాంతి భద్రతల పరి రక్షణ కోసం దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఈ జిల్లాలో వున్న 7 తాలూకాల్లో అవంతీపుర ఒకటి . ఈ అవంతీపుర దగ్గరనే ఉగ్రదాడి జరిగింది . పుల్వామా 949 కిలో మీటర్ల విస్తీరణంలో వుంది . ఈ జిల్లా జనాభా 5 లక్షల 70 వేలమంది . పుల్వామాను అక్షయ పాత్ర అంటారు . ఇక్కడ వరి , కుంకుమ పువ్వు, నూనె గింజలు , బాదం పంటలు పండుతాయి విస్తారంగా పండుతాయి .
యాపిల్ తోటలు కూడా ఎక్కువగానే ఉంటాయి . ఇక రాష్ట్రము మొత్తం మీద అత్యధిక పాల ఉత్పత్తి పుల్వామా లోనే జరుగుతుంది ఈ జిల్లాలో జమ్మూ అండ్ కాశ్మీర్ సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు మరెన్నో పరిశ్రమల వాళ్ళ ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది . 1999లో వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఢిల్లీ లాహోర్ కు బస్సు సౌకర్యం కల్పించారు . ఒకప్పుడు పాకిస్తాన్ భారత్ లో అంతర్భాగం కావడంతో రెండు దేశాలనుంచి వచ్చిపోయేవారు వున్నారు .
వాజ్ పేయ్ స్పూర్తితో మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్నప్పుడు 2005లో శ్రీనగర్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించారు . అంతకు ముందు అక్కడ రెండు దేశాల మధ్య రాకపోకలు లేవు . శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ 180 కిలో మీటర్ల దూరంలో వుంది . ఆజాద్ కాశ్మీరుగా పిలుచుకునే ముజఫరాబాద్ పేరుకే స్వతంత్ర రాజ్యం . కానీ పెత్తనం మాత్రం పాకిస్తాన్ దే . ఈ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర మూకలు తలదాసుకుంటున్నాయి .
ఇక్కడ నుంచి శ్రీనగర్ కు బస్సు సౌకర్యం ఏర్పడటంతో ఉగ్రమూకలు భారత్ లోకి చొరబడి ఇక్కడి యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు . అలా ఉగ్రవాదిగా మారినవాడే గుండి భాగ్ అదిల్ అహ్మద్ దార్ . ఇలాంటి వారు ఇంకా పుల్వామాలో ఎందరు వున్నారో ? ఇప్పుడు పుల్వామా లో కూడా యువకులు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది . అందమైన కాశ్మీర్ ఇప్పుడు ఉగ్రమూకల అడ్డాగా మారిపోయింది . ఎర్రటి కుంకుమ పూవు పండించే పొలాల్లో రక్తం చిందుతోంది !
-భగీరథ