protest with Ministers at LG House

కేజ్రీవాల్ దీక్షకు స్పందించని గవర్నర్…మద్దతుగా సీ.పీ.ఐ

15

గత మూడు రోజులుగా కొనసాగుతున్న కేజ్రీవాల్ దీక్షకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నా, లెఫ్ట్ నెంట్ గవర్నర్ స్పందించడం లేదు. మూడు రోజులనుంచి రాజ్ నివాస్ వెయిటింగ్ హాల్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మంత్రులు సత్యేంద్ర కుమార్ చైన్, గోపాల్ రాయ్ లు ఉన్నారు.

రేషన్ సరుకులను ఇంటివద్దకె పంపించేందుకు ఆమోదం మరియు ఆందోళన చేస్తున్న ఐ.ఏ.ఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్ దీక్షకు మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీ.పీ.ఐ. మద్దతు పలుకుతూ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వైకరిణి మార్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఇలా దీక్షకు కూర్చునే విధంగా మారిందని, సమస్యను తొందరగా పరిష్కరిస్తే బాగుంటుందని లేదంటే మద్దతుగా మేము కూడా దీక్షకు దిగే ఆలోచనలున్నాయని లేఖలో పేర్కొంది.

అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను చర్చించనున్నారు.