telugu navyamedia
రాజకీయ

యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రియాంక?

యూపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటినుంచే వ్యూహరచన మొదలుపెట్టాయి. యోగీ నేతృత్వంలోనే 2022 ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా, కాంగ్రెస్ పార్టీ కొత్త త‌రం నేత‌ల‌తో దూకుడు పెంచేందుకు సిద్ధం అవుతున్న‌ది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే బీజేపీ ని ఓడించాలని కాంగ్రెస్ ఓ ఉహ‌ర‌చ‌న‌ అమలు చేసే ఆలోచనలో ఉంది.

Rahul and Priyanka Gandhi arrested on way to meet Indian rape victim's family | India | The Guardian

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యక్షంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మొద‌టిసారి యూపి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రాను ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు క‌న‌బ‌డుతోంది. ఆమె నేతృత్వంలోనే కాంగ్రెస్‌.. యూపీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధి నేతృత్వంలో తమ పార్టీ బరిలోకి దిగనుందని ఖుర్షీద్ అన్నారు.

సీఎం అభ్యర్థిగా కూడా ఆమెనే ప్రకటించే అవకాశం ఉందని, త్వరలోనే దీని గురించి స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. యూపీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కూటమి ఏర్పాటు చేయబోవట్లేదని, రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను దించనున్నట్లు తెలిపారు. ఎవరైనా తమతో చేతులో కలిపేందుకు సిద్ధంగా ఉంటే.. వారిని సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.

Priyanka Gandhi's phone hacked by WhatsApp spyware, alleges Congress
దీంతో వ‌చ్చే ఎన్నిక‌లు యోగీ వ‌ర్సెస్ ప్రియాంక గాంధీ జ‌రిగే అవ‌కాశం ఉంది. అమేథి నుంచి రాహుల్ గాంధీ ఓటమిపాల‌య్యాక ఆ పార్టీ బ‌లం చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం బీజేపీ కొంత ఎదురుగాలి వీస్తున్న‌ది. బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తున్న‌ది.

Related posts