priyanka-chopra

ప్రియాంక పెళ్ళి పీటలెక్కబోతుందా…?

11

బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా పెళ్లి పీటలెక్కబోతుందా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తుంది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ తో ప్రియాంక చాలా క్లోజ్ గా ఉంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి పరిచయం పెళ్లిదాకా వచ్చిందని అంతా అనుకుంటున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి నిక్ జోనస్ బంధువుల పెళ్ళికి హాజరయ్యారు. పెళ్ళికి నిక్, ప్రియాంక చేతిలో చెయ్యివేసుకొని సరదాగా వెళ్లారు. పెళ్ళిలో ప్రియాంక నిక్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది.

priyanka-chopra-nick-jonas

దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని గత సంవత్సర కాలంగా వార్తలు విన్పిస్తున్నాయి. కానీ వీరిద్దరూ ఈ వార్తల్ని ఖండించక పోవడం విశేషం.

Priyanka
అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా ? అనే ప్రశ్నకు అవునని ఖచ్చితంగా సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఇంతముందు ప్రియాంకపై ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. బాలీవుడ్ లో ఉన్నప్పుడు చాలామంది సీనియర్ హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయనే వార్తలు హల్చల్ చేస్తుండేవి. అంతేకాకుండా నిక్, ప్రియాంకల మధ్య వయసు తేడా కూడా చాలానే ఉంది. నిక్ వయసు 25 ఏళ్ళు అయితే ప్రియాంక అతనికంటే 12 సంవత్సరాలు పెద్దది. ఇక వీరిద్దరి కుటుంబాలు, సంస్కృతుల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి పెళ్ళికి చాలా తక్కువ అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రియాంక ఫ్రాంచికో మూడో సీజన్ లో నటిస్తోంది. ఈ సిరీస్ తరువాత సల్మాన్ ఖాన్ సరసన మరో సినిమాలో చేయడానికి సిద్ధమవుతోంది ప్రియాంక.