telugu navyamedia
సినిమా వార్తలు

ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ మన సంపదను దోచేసుకున్నారు… ప్రియాంక చోప్రాకు క్రేజ్ తగ్గలేదుగా…

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రియాంక చోప్రా 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టినరోజు వేడుక సందర్భంగా భర్త జోనస్, తల్లి మధు చోప్రా, మరికొందరు స్నేహితులతో కలిసి మియామీ సముద్రతీరంలో విహరించారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా సిగరెట్ తాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ప్రియాంక చోప్రా ఓ సందర్భంలో స్మోకింగ్ చాలా భయంకరమైనది, ఛండాలమైనది అంటూ ట్వీట్ చేశారు. దాన్ని గుర్తు చేస్తూ తమరు మందికి నీతులు చెప్పడమే తప్ప మీరు పాటించరా? అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా ప్రియాంక క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈమెను టాప్ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే షోలో బాలీవుడ్ సెలెబ్రెటీస్ మధ్య ప్రియాంకను ఆకాశానికి ఎత్తేసాడు. ఈ కమెడియన్ నిర్వహిస్తున్న కామెడీ షోకు ఇటీవల బాలీవుడ్ తారలు పరిణితి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రాలు హాజరయ్యారు. అయితే కాగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు పరిణితి చోప్రా వరసకు సోదరి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక పెళ్లిని ఉద్దేశించి కపిల్ శర్మ “మరోసారి ఆంగ్లేయులు దోపిడికి పాల్పడ్డారు” అని పరిణితిని ఉద్దేశించి కపిల్ శర్మ వ్యాఖ్యానించాడు. కపిల్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు మొదట అక్కడున్న వారికి అర్ధంకాలేదు.. దీంతో కపిల్ శర్మ గతంలో భారత దేశాన్ని ఆంగ్లేయులు దోచుకెళ్లారు. ఇప్పుడు నిక్ జోనస్‌ అందాల భామ ప్రియాంకను పెళ్లాడడం ద్వారా మన సంపదను మరోసారి దోచుకున్నారంటూ వివరణ ఇవ్వగా అక్కడ ఉన్నవారందరూ పగలబడి నవ్వారు. ఇంగ్లీష్ వారు మనసంపదను దోచుకున్నారు అంటూ కోహినూర్ వజ్రంతో ప్రియాంక చోప్రాను పోల్చాడు ఈ కమెడియన్.

Related posts