telugu navyamedia
సినిమా వార్తలు

గ్లోబల్ స్టార్ కు లైంగిక వేధింపులు

Priyanka-Chopra

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొన్నిరోజుల క్రితం ఈ జంట విడాకులు తీసుకోబోతుందంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఎవరేమన్నా పట్టించుకోకుండా ఈ జంట తమ బిజీ లైఫ్ తో, మధ్యలో ట్రిప్ లతో హ్యాపీగా గడుపుతున్నారు.
కాగా ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి పెద్ద ఉద్యమం జరిగింది. ‘మీటూ’ అంటూ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటీమణులు బయటకొచ్చారు. కానీ ప్రియాంక చోప్రా అప్పుడు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనని సెక్సువల్ వేధింపులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదట యాంకర్.. ‘ఎప్పుడైనా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారా..?’ అని ప్రశ్నించగా.. వెంటనే తన చెయ్యి పైకెత్తి.. ”ఎస్.. నేను కూడా బాధితురాలినే” అని చెప్పింది. అయితే అంతకుమించి పూర్తి వివరాలను చెప్పలేదు. తనను ఎవరు వేధించారు..? ఎప్పుడు వేధించారనే విషయాలపై మాట్లాడడానికి ప్రియాంక ఇష్టపడలేదు.

Related posts