telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారతదేశపు మొట్టమొదటి వర్చ్యువల్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో

Prithviraj

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ఓ వర్చ్యువల్ చిత్రంలోచిత్రంలో నటించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించాడు. “ఫిల్మ్ మేకింగులోనే ఇదొక గొప్ప కళ.. అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఇదొక ఉతేజాన్నిచ్చే కొత్త అధ్యాయం.. అందుకోసం ఎదురుచూస్తూ ఉండండి. మారుతున్న కాలాలు కొత్త కొత్త సవాళ్లు వినూత్న పద్ధతులను అనుసరించి ఒక గొప్ప పురాణ కథను గొప్పగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అప్డేట్స్ కోసం వేచి ఉండండి” అంటూ ఒక పోస్టర్ కూడా షేర్ చేసాడు. భారతదేశపు మొట్టమొదటి వర్చ్యువల్ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా గోకుల్రాజ్ బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు గాని ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారట. ఈ ఏడాది ప్రారంభంలో “అయ్యప్పనమ్ కోషియం” అనే సినిమాతో తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నాడు.

Related posts