telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్..

Prabhas

“బాహుబ‌లి” చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. “బాహుబ‌లి” కోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడు ప్ర‌భాస్. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబ‌లి సిరీస్‌లో వ‌చ్చిన రెండు సినిమాల‌ త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ ఖండాంత‌రాలు దాటింది. ఇప్పుడు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం వీరాభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇవాళ ప్రభాస్ జన్మదినోత్సవం. దీంతో అటు అభిమానులు, ఇటీ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ కూడా తాజాగా ప్రభాస్‌కు ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. ‘అర్జున్’ సినిమా ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అయితే మహేష్ ఓ చిన్నపొరపాటు చేసినట్లు గుర్తించి వెంటనే సరి చేస్తూ మరొక ట్వీట్ చేశాడు. మహేష్ తొలిసారి ట్వీట్ చేసినప్పుడు ప్రభాస్ ఐడికి బదులుగా వేరొకరి ఫేక్ అకౌంట్ అడ్రస్ తో ట్యాగ్ చేశాడు. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే వేరొకరి పేరును చూపిస్తోంది. దీంతో కొద్దిసేపటికి విషయం తెలుసుకున్న మహేష్ ఆ ట్యాగ్ ను తీసేశాడు.

Related posts