telugu navyamedia
Operation Sindoor

ఆపరేషన్ సిందూర్ విజయాన్ని జవాన్లతో పంచుకున్న ప్రధాని మోదీ: భారత్ శక్తిని ప్రపంచం చూసింది

ఆదంపూర్ ఎయిర్ బేస్‍లో జవాన్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం – భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రధాని- మన సైనికులు యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు – భారత్ మాతాకీ జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది – ఉగ్రవాదం అంతం చూస్తామంటూ మన సైన్యం శపథం చేసింది – మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలను ఎంత ప్రశంసించినా తక్కువే – భారత సైన్యం శక్తిసామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది – మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ – ఈ వీరభూమి నుంచి వీర సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నా – మీ వల్ల ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది – ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలబడ్డాడు – ప్రతి భారతీయుడు భారత సేనలకు కృతజ్ఞతలు చెబుతున్నాడు – మన సైన్యం చేపట్టిన ఈ పరాక్రమం భారత సామర్థ్యానికి ప్రతిరూపం – భారత్ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణీ సంగమం – ధర్మసంస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయం.. మన విధానం – అక్కాచెల్లెళ్ల సిందూరం తుడిచినవారిని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం – మీరు చేసిన దాడితో శత్రువులు బదాబదలయ్యారు – మీరు కొట్టిన దెబ్బతో శత్రు స్థావరాలు మట్టిలో కలిశాయి – భారత త్రివిధదళాలు పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయి – గట్టి దాడి ద్వారా పాక్ సైన్యానికి స్పష్టమైన సందేశం ఇచ్చాం – పాక్‌లో ప్రశాంతంగా శ్వాస పీల్చుకునే అవకాశం లేకుండా చేశాం – మన డ్రోన్లు, మిసైళ్లు పాక్‌లోకి చొచ్చుకువెళ్లి విధ్వంసం సృష్టించాయి – పాకిస్థాన్ సైన్యానికి నిద్ర లేని పరిస్థితి సృష్టించాం – పాక్ భూభాగంలో ఏ స్థావరాన్నెనా గురిచూసి కొట్టగలమని నిరూపించాం – ఆపరేషన్ సిందూర్ భారత ఆత్మవిశ్వాసాన్ని ద్వికగుణీకృతం చేసింది – ఆపరేషన్ సిందూర్.. భారత ఆత్మవిశ్వాసానికి కొత్త ప్రమాణాలు లిఖించింది – 25 నిమిషాల్లో సరిహద్దు ఆవలి ఉగ్రస్థావరాలను కచ్చితంగా గురిచూసి కొట్టాం – ఆధునిక సైనిక సాంకేతిక సామర్థ్యం కచ్చిత లక్ష్యాలు సాధించింది – పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడమే మన లక్ష్యం – భారత్ దాడులను పాకిస్థాన్ తట్టుకోలేకపోయింది – ప్రయాణికుల విమానాలను అడ్డుపెట్టుకుని పాకిస్థాన్ యుద్ధానికి దిగింది – ప్రయాణికుల విమానాలకు మనం చిన్న నష్టం కూడా కలగనీయలేదు – కచ్చితమైన నైపుణ్యంతో ఉగ్ర స్థావరాలను నాశనం – పాక్ దుస్సాహసం, ఉగ్రవాద మద్దతు.. రెండింటిపైనా విజయం సాధించాం – మన వైమానిక స్థావరాలపై దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నించింది -పాక్ దాడులను సరిహద్దుల ఆవలే మన త్రివిధ దళాలు తిప్పి కొట్టాయి – మన క్షిపణి రక్షణ వ్యవస్థ ముందు పాక్ డ్రోన్లు, క్షిపణులు, విమానాలు తుడిచిపెట్టుకుపోయాయి – మన త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది – మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ సమాధానం ఎలా ఉంటుందో పాక్‌కు అర్థమైంది : ప్రధాని మోదీ

Related posts