telugu navyamedia
నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

అమెరికా అధ్యక్షుడు గా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన నేతలు, హాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు.

భారత్ తరపున విదేశాంగమంత్రి జైశంకర్ ప్రమాణస్వీకార వేడుకకు హాజరయ్యారు.

మరోవైపు ట్రంప్ కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా ప్రియమిత్రుడు ట్రంప్ కు శుభాకాంక్షలు.

భారత్- అమెరికా దేశాల మధ్య ప్రయోజనాల కోసం, ప్రపంచానికి మంచి భవిష్యత్తు కోసం మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నా. అమెరికా అధ్యక్షుడిగా మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలి’ అని ట్వీట్ చేశారు.

Related posts