BREAKING NEWS:
precautions for rainy season

వర్షాలు మొదలు…రోడ్లపై డ్రైనేజీలు ఉన్నాయి…జాగర్త…

51

భారీ వానలతో ముంబై నగరం అతలాకుతలం అయ్యింది. ఈ భారీ వర్షాలకు రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయి నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎన్.టి.ఆర్.ఎఫ్ తీవ్రంగా సహాయక చర్యలు చేపడుతుంది.

వర్షాభావంతో పలుచోట్ల లోకల్ ట్రైన్ లు రద్దు చేశారు. విమాన రాకపోకలు కూడా ఇబ్బందిగా మారాయి ఈ వర్షాలు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు, ప్రజలు రోజువారీ పనులు చేసుకోడానికి వీలులేకుండా ఉంది.

మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ. ఈ భారీ వర్షాలకు కార్పొరేషన్ సిబ్బందిని వారి సెలవులను రద్దు చేసి మరీ సహాయక చర్యలలో పాల్గొనాలని అధికారులు ఆదేశించారు.

ఈ సారి ఋతుపవనాలు తొందరగా కేరళాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వేసవి తాపం తగ్గి వాతావరణం కాస్త చల్లబడింది అనుకునేలోపే వర్షాలతో అసలు ఏపనులు చేసుకోలేని స్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం ముందుగానే వర్షాకాలానికి సిద్ధమవ్వాలని హితవు పలికింది, కానీ డ్రైనేజీలు…తదితర విషయాలలో ముందు జాగర్త చర్యలైతే ఏమి తీసుకున్నట్టు తోచడంలేదు. కాస్త వర్షం పడితే రోడ్లన్నీ మురుగు నీటితో నిండిపోయి కనీసం నడవటానికి కూడా కుదరదు సరికదా…నిర్లక్ష్యంగా తెరిచి ఉంచిన డ్రైనేజీలలో పడి ప్రమాదానికి గురయ్యే వారి సంఖ్య ఏమాత్రం ఉందొ ఒక్కసారి లెక్కలు చూసుకుంటే ప్రభుత్వం మేలుకొని వర్షాకాలానికి ముందు జాగర్తలు కలిసి తీసుకోని అందరు ఆరోగ్యంగా, సౌకర్యంగా ఉండొచ్చు.