Remove term: Prashant Kishor Survey at Pulivendula Prashant Kishor Survey at Pulivendula

ప్రశాంత్ కిషోర్ సర్వే…జగన్ కు వ్యతిరేకం ఎందుకు…

32

పులివెందుల పులి బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గురించి నిర్వహించిన సర్వేలో కీలక అంశాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. జగన్ మోహన్ రెడ్డి సలహాదారుడు ప్రశాంత్ కిషోర్, అన్ని నియోజకవర్గాల్లో చేసిన విదంగానే ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కూడా సర్వే చేయగా షాకింగ్ రిపోర్ట్ వచ్చింది, అదే రిపోర్టును జగన్ మోహన్ రెడ్డికి ఇవ్వగా, అసహనం వ్యక్తం చేస్తూ మరోసారి సర్వే నిర్వహించాలని జగన్ చెప్పినట్టు  వార్తలు వచ్చాయి.

prashant-kishor-survey-at-pulivendula

ఆంద్రా జిల్లాల ప్రజలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని అంటూ, పులివెందుల సర్వే రిపోర్ట్ బిన్నంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన జగన్ మరోసారి సర్వే నిర్వహించమని ప్రశాంత్ కిషోర్ కు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నది వస్తుంది కాని, లేనిది ఎక్కడ నుంచి వస్తుంది అన్న చందాన ఉంది ఇదంతా. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందో చూద్దాం…

నాలుగు దశాబ్దాలుగా పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న విషయం అందరికీ తెలిసిందే. పులివెందుల మెజారిటీ పైనే కడప పార్లమెంట్ సీటు ఆధారపడి ఉంది అంటే అక్కడ విజయం ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుందో తెలుస్తుంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్ తన మార్క్ ను ప్రదర్శించేవారనీ, అవసరమైతే సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించే వారనీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి హయాంలో పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయి. తన సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేని దీన స్థితికి పడిపోయాడు, కడపలో జరుగుతున్న రాజకీయ చర్చలపై ఎన్నడూ లేనివిధంగా వైఎస్ ఫ్యామిలీకి కడపలో ఓటమి తెలిసొచ్చింది. వీటన్నింటికి ప్రధాన కారణం చంద్రబాబు అభివృద్ధి అనే మంత్రంతో, పాజిటివ్ ఫీల్ తో పులివెందుల ప్రజలకు చేరువ అయ్యారు, అంతే కాకుండా జగన్ వైఖరి కూడా ఈ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు.

pulivendula-survey-report

నాలుగు దశాబ్దాల చరిత్రలో వైఎస్ ఫ్యామిలీ పులివెందులకు సరైన త్రాగునీటి సదుపాయం కానీ, మౌలిక సమస్యలపైనా ద్రుష్టి సారించలేకపోయారు. వైఎస్ కుటుంబం పరిష్కరించలేని చాలా సమస్యలని చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. కృష్ణా జలాలను గండికోట ప్రాజెక్టుకి తరలించడం, గండికోట నుంచి పులివెందుల దగ్గర ఉన్న చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరు మళ్లించడం, తద్వారా పులివెందుల కెనాల్ కు విడుదల చేసిన నీటితో అక్కడి ప్రజలకు సాగుకు, త్రాగడానికి అందుబాటులోకి తెచ్చారు. దీనితో పులివెందుల ప్రాంత మంతా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది ఆర్థికంగా కోలుకున్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమ కార్యక్రమాలను పులివెందుల ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ లేనిది, పులివెందులలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహిస్తే.. భారీ సంఖ్యలో జనం తరలివస్తున్నారు.

gandikota-water-project

చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో, జగన్ చేస్తున్న రాజకీయ వైఖరితో పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ కంచు కోటకు బీటలు పడ్డాయనే చెప్పుకోవాలి. ఈ పరిణామాల్లో సర్వే నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ కు, షాకింగ్ రిజల్ట్ రావడంతో అందులో ఈ సారి వైసీపీ పార్టీకి 10 వేల మెజారిటీ కూడా దాటదు అంటున్నారు. కడపలో పార్లమెంట్ సీటును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే ఎన్నికలకు ఇంకా సంవత్సరం గడువు ఉండగానే, ఎన్నికల సమయం వరకు పరిస్థితి చేజారి పోవచ్చనే ముందస్తు ప్రణాళికతో మరో సీట్ పై కూడా కన్నేసి ఉంచాలని ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ తయారు చేసి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారని సమాచారం.

Prashant-Kishor-jagan

ఇంత పేలవమైన ప్రభావం రిపోర్టులో తేలినా, జగన్ మాత్రం తన సహజ స్వభావాన్ని చూపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో లక్ష మెజారిటీ వస్తుంది, నువ్వు చేసిన సర్వేలో తప్పులు దొర్లాయి, మరొకసారి సర్వే నిర్వహించి రిపోర్ట్ తీసుకురమ్మని ప్రశాంత్ కు ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికిని జగన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికల ద్వారా పులివెందులలో గట్టి పట్టు సాధిస్తే ఎన్నికల్లో అనుకున్న మెజారిటీ రావడానికి అవకాశం ఉందని వైసీపీ రాజకీయ వేత్తలు గుసగుసలాడుకుంటున్నారు.