telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్

KA Paul comments Chandrababu

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని కేఏ పాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయనీ, తాము హెలికాప్టర్ గుర్తుకు కు ఓటు వేస్తే ఫ్యాను కు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు.

కపిల్ సిబల్ లాంటి వ్యక్తులు చెప్పినదాని ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయిందన్నారు. నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నాని తెలిపారు. ఏపీలో ఎన్నికలు రీకాల్ చేయాలని హైకోర్టుకు వెళితే పిటిషన్ ను కొట్టేశారని పేర్కొన్నారు. ఏదేమయినా ఏపీలో మాకు 30 ప్లస్ సీట్లు వస్తాయి. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పై దీన్నే తన కామెంట్ గా పరిగణించాలని మీడియా ఛానల్స్ కు విజ్ఞప్తి చేశారు.

Related posts