YS Jagan

తూర్పులోకి అడుగిడనున్న ప్రజా సంకల్ప యాత్ర .

25
వైసీపీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ తన 187 వ రోజు పాదయాత్ర ద్వారా ఈ రోజు  రాజమండ్రి  రోడ్ కం రైల్ బ్రిడ్జి ఫై పాదయాత్ర చేయనున్నారు  ఈ మార్గం గుండా తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగిడనున్నారు ,4 కిలోమీటర్ల వంతెన పొడువునా వైస్సార్సీపీ జెండాలు నిండిపోయాయి జగన్ కు భారీగా స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి పార్టీ జెండా తెరచాపలతో కూడిన 400 ల  పడవలను గోదావరిలో 1600 మత్స్య కారులు  నడపనున్నారు , 2003 లో వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థాన యాత్ర కూడా రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జి ఫై సాగి విజయవంతమైంది ,పాదయాత్ర కు ఇబ్బందులు తలెత్తకుండా రాజమండ్రి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను తెచ్చారు ,బహిరంగ సభకు వచ్చే వారికోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసారు ,కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో  గోదావరికి పూజలు చేసి జగన్ ఈ రోజు పాదయాత్ర ప్రారంభించారు . ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు జగన్  కోటిపల్లి బస్సు స్టాండ్ వద్దకు చేరుకోవచ్చు ..అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు