యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”.ఈ సినిమాలో ప్రభాస్.. విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది.
పాన్ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ గురువారం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇదే వేడుకలో ప్రభాస్ అభిమానులు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఇది మాములు లవ్ స్టోరీ కాదు… పెదనాన్నగారి ఫోటో చూశారు కదా.. చిన్నపాటి దేవుడిలా ఉన్నారు కదా.. గోపికృష్ణ సినిమా అంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది.. పెదనాన్న గారి మనవూరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి పెద్ద సినిమాలు చేశారు.. ఆ తరువాత బిల్లా తీశారు. అది బాగానే ఆడింది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్.. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీనే కానీ .. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి థాంక్స్.. పూజా ఈ సినిమాలో చాలా బాగా నటించింది.
డైరెక్టర్ రాధా గురించి చెప్పాలంటే.. 5 ఏళ్లు సినిమాలో కూర్చోడమంటే జోక్ కాదు.. సినిమా స్టార్ట్ అయ్యి మధ్యలో సాహో వలన ఆగి , ఇంకొన్ని రోజులు కరోనా వలన ఆగి .. చాలా కష్టపడ్డారు. ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. క్లయిమాక్స్ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సాహో సమయంలో ఇండియా అంతా తిరిగి సిగ్గుపోయి .. ఈ ఈవెంట్ లో బాగా మాట్లాడేస్తాను అనుకున్నాను.. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాన.. కానీ నా సిగ్గు పోలేదండి .. ఇక ఇది పోదేమో .. ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కారణం అభిమానులే లవ్ యూ సోమచ్ ” అని ముగించారు.