కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరిద్దరు “బుజ్జిగాడు” చిత్రంలో కలిసి నటించారన్న విషయం తెలిసిందే. అయితే బుజ్జిగాడు సినిమా నుండి ప్రభాస్, మోహన్ బాబు మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. తాజాగా ప్రభాస్, విష్ణు ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఆ సమయంలో ప్రభాస్, మోహన్ బాబు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. “చిన్నప్పుడు నా ముక్కుతో టమోటాలు కోశా. మీరు కోయలేదు కదా.. అదే మరి అంత షార్ప్ నా ముక్కు” అని ప్రభాస్ నవ్వుతూ మోహన్ బాబుతో అన్నారు. కాసేపు ఆగిన మోహన్ బాబు “నా ముక్కుతో కోడి మెడ కోశా” అనగానే అక్కడే ఉన్న శ్రీకాంత్, ప్రభాస్ పగలబడి నవ్వారు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోని విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎంతో గంభీరంగా ఉండే మోహన్ బాబుతో ప్రభాస్ ఇంత సాన్నిహిత్యంగా ఉండడాన్ని చూసి ఇటు మంచు అభిమానులు, అటు ప్రభాస్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.
previous post