telugu navyamedia
సినిమా వార్తలు

నా పేరు విక్రమాదిత్య నేను దేవుడ్ని కాదు…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమాల అప్డేట్ వ‌చ్చేసింది. రాధేశ్యామ్ మూవీ టీజర్ ని అక్టోబ‌ర్ 23న‌ డార్లింగ్ బర్త్ డే కానుకగా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇదొక రొమాంటిక్‌ లవ్ స్టోరీ. ప్రభాస్ పూర్తిస్థాయి లవర్ పాత్రలో కనిపించనున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పుజా హెగ్డే కనిపించనున్నారు.

Prabhas Unveils New Release Date of Radhe Shyam, Film to Hit Theatres on  Pongal 2022

ఇందులో ప్ర‌భాస్‌ హస్తసాముద్రిక నిపుణుడి గా ఆయన డైలాగ్ లు, ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీ లో జ‌రిగే ప్రేమ‌క‌థ గా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు దర్శకుడు కె కె రాధాకృష్ణ కుమార్.

Radhe Shyam: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న డార్లింగ్.. నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

ఈ టీజర్ అంతా ప్రభాస్ వాయిస్ ఓవర్ తో సాగింది. “నువ్వెవరో నాకు తెలుసు కానీ చెప్పను. నీ ప్రేమ విఫలమవడం నేను ఫీల్ అవ్వగలను కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు కానీ చెప్పను. నీ చావు కూడా నాకు తెలుసు కానీ చెప్పను. నాకు అన్ని తెలుసు అయినా నీకు చెప్పను ఎందుకంటే అవి నీ ఆలోచనలకి అందవు. నా పేరు విక్రమాదిత్య నేను దేవుడ్ని కాదు. కాని మీలో ఒకడ్ని కూడా కాదు” అంటూ ప్రభాస్ చెప్పే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ విశేషంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. డైలాగ్స్‌కు జస్టిన్‌ ప్రభాకరణ్‌ మంచి మ్యూజిక్ ను అందించారు.

Prabhas's picture from the sets of Radhe Shyam goes viral. Seen yet? -  Movies News

కాగా.. జనవరి 14న సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవ్వబోతుంది అని మరోసారి తెలిపారు. ‘రాధేశ్యామ్’ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ టీజ‌ర్ 24 గంటలు కూడా కాకముందే 36 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

Related posts