world yoga day6

యోగా…’పవర్’…

158

యోగా అంటే మనందరికీ తెలిసిందే..అయితే అది ఎప్పుడు చేయాలన్నా మనకు సహజంగా అనిపించేది అంతలా మన శరీరం వంపులు తిరగదులే అనుకుంటూ ప్రయత్నానికి ముందే చేయటం ఆపేస్తుంటాము. అలా కాకుండా ప్రయత్నించి చూసినవారికి దానికి తగ్గట్టే ఫలితాలు వచ్చిన సందర్భాలు కూడా మన చుట్టుపక్కలే చూసో, వినో ఉంటాము. అవి చూసి స్ఫూర్తి పొందిన వారూ లేకపోలేదు.

ఇక యోగా వివిధ దేశాల వారు మనదేశానికి వచ్చి నేర్చుకువెళ్లి రకరకాల పేర్లు పెట్టారు. అలాంటి వెస్ట్రన్ పదమే ఈ పవర్ యోగా కూడా. అసలు మొదలైతే పెడితే ఏదో ఒకటి చేస్తూ దాని ఫలితాలు పొందాకైనా కొంత పరిశోధించి తెలుసుకొని తరువాతి ప్రయత్నాన్ని మరింత చక్కగా ప్రారంభించి ఇంకా చక్కటి ఫలితాలను పొందుతాము.

ఇక పవర్ యోగా(జిం యోగా) అనేమాట అయితే పుట్టింది కదా, అందులో ఏమేమి ముఖ్యమైనవి ఉన్నాయో చూద్దాం…
ఇది పదం పుట్టింది 1990లో కాగా అష్టాంగ యోగా కు మరో రకంగా చెప్పారు. ఈ యోగా వల్ల శారీరక మానసిక వత్తిడులు తొలగి శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోయి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది.

ఈ యోగా వల్ల శరీరానికి శక్తి, రోగనిరోధక శక్తిని పుంజుకోడానికి ఉపకరిస్తాయి. సాధారణ యోగాలో ఆసనానికి ఆసనానికి మధ్య సమయం తీసుకోని ఆసమయంలో కాస్త విశ్రాంతి తీసుకోని అటు తరువాత మళ్ళీ కొనసాగిస్తాము…కానీ పవర్ యోగాలో ఆసనానికి ఆసనానికి మధ్య విశ్రాంతి లేకుండా చేయటం వల్ల (మరీ విశ్రాంతి కావాల్సిందే అంటే తీసుకోవచ్చు) శరీరం లో కొత్త శక్తీ జనించి ఉత్తేజాన్ని , ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ యోగాని కనుగొన్నది బెరిల్ బెండర్ బిర్చ్.

మనం ఇక్కడ 7 ముఖ్యమైన పవర్ యోగాసనాలు ఎలా చేయాలో చూద్దాం… ఈ ఆసనాలను ఉదయం పొరగడుపున, లేదా సాయంత్రం ఏదైనా తిన్నాక 4-6 గంటల తరువాత మాత్రమే చేయాలి.

1.అర్ధ చంద్రాసన (హాఫ్ మూన్ పోజ్): పేరు చెప్పినట్టుగా అర్ధచంద్రాకారంలో నే ఈ ఆసనం ఉంటుంది. ఇది హస్తయోగాసనకు ప్రారంభ ఆసనం.

power yoga and its benefits

ఈ ఆసనం వేయటం వలన కాళ్ళు బలంగా తయారవుతాయి ఇంకా పిరుదులు, వెన్నెముక కు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే మోకాలు చిప్పలు, హిప్స్ కు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఆసనంతో ఆయా అవయువల మధ్య సహకారం మరియు సంతులతను చేకూరుస్తుంది.

2. పరిపూర్ణ నవాసన (బోట్ పోజ్):

power yoga and its benefits1

ఈ ఆసనం ‘వి’ ఆకారంలో వేసినట్టు మనకు తెలుస్తుంది. అష్టాంగ యోగాసన లో ఇది మధ్యంతర స్థాయికి చెందినది. ఆసనంలో 10 నుండి 60 సెకండ్ల పాటు ఉండాలి, ఒక్కసారే అలాగ ఉండలేని పరిస్థితులలో నెమ్మదిగా ఆస్థాయికి రావాల్సి ఉంది.

ప్రయోజనాలు : పొత్తికడుపు కు ప్రయోజన చేకూరటంతో పాటు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. థైరాయిడ్ పనితనాన్ని పెంచుతుంది, మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేస్తుంది మరియు ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది.

3. ఉష్ట్రాసన (కామెల్ పోజ్):

power yoga and its benefits2

ఈ ఆసనంలో వెనక్కి వంపుతిరగటం వల్ల చూసేందుకు ఒంటె మాదిరి కనిపించడంతో దీనికి ఆపేరు వచ్చింది. ఈ ఆసనం విన్యాస యోగా ఆసన ప్రాథమిక స్థాయికి చెందినది. ఈ ఆసనంలో 30 నుండి 60 సెకండ్ల వరకు ఉండవచ్చు.
ప్రయోజనాలు : వెనక్కి వంపుతిరుగుతం కదా, దీనివలన వీపు భాగాలు మరియు భుజాలకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు నించున్నప్పుడో లేక కుర్చునప్పుడో భంగిమ మరియు శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నునిప్పికి ఇది సరైన ఆసనం, అలాగే తొడలను బలీయంగా చేసేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది.

4. శలభాసన (లోకస్ట్ పోజ్) :

power yoga and its benefits3

ఈ ఆసనం బోర్లా పడుకొని వెనక్కి వంగటం కనుక చూడటానికి మిడత మాదిరిగా ఉంటుంది. ఈ ఆసనంలో కూడా 30 నుండి 60 సెకండ్లు ఉండటం వలన ప్రయోజనం కలుగుతుంది.
ప్రయోజనాలు : ఈ ఆసనం తో వెనుక ఉన్న శరీరం పైన కిందా ఒత్తిడి కలిగి అక్కడి అవయవాలు విశ్రాంతిని పొందుతాయి, దీనితో ఆయా భాగాలు ఆరోగ్యంగా పనిచేయడానికి ఉపకరిస్థాయి. ఈ ఆసనం వలన కలిగే మరో ప్రయోజనం ఏమంటే మనసును శాంతిపజేస్తూ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

5. చతురంగ దండాసన (ప్లాంక్ పోజ్) :

power yoga and its benefits4

ఈ ఆసనం లో మీ రెండు చేతులు, కాళ్ళు మాత్రమే ఆధారంగా శరీరాన్ని గాలిలో ఉంచడం జరుగుతుంది. ఈ ఆసనంలో కూడా 30 నుండి 60 సెకండ్ల పాటు ఉండగలిగితే ప్రయోజనం ఉంటుంది.
ప్రయోజనాలు : శరీరంలోని ముఖ్య కేంద్రాలలో చలనం కలిగి ఒత్తిడి తగ్గిస్తుంది. ఇది మీ మనస్సును మరియు శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. మణికట్టు, కాళ్ళు మరియు మాడిమలకు శక్తినిస్తుంది.
6. అదో ముఖ స్వనాశన (డౌన్ వార్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్):

power yoga and its benefits5

ఈ ఆసనంలో 1 నుండి 3 నిముషాల వరకు ఉన్నట్టయితే ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రయోజనాలు : మనసుకు మరియు శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది ఈ ఆసనం. ఊపిరితిత్తులకు ఇది చాలా ప్రయోజనకారి. మానసిక ఒత్తిడిని తొలగిస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల వ్యాదులనుండి రక్షిస్తుంది.
7. ఉత్కఠసన (చైర్ పోజ్) :

power yoga and its benefits6

ఈ ఆసనం లో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఈ ఆసనం కూడా 30 నుండి 60 సెకండ్లు వేయాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు : పట్టుదలను పెచుతుంది. కాలి కండరాలను దృడంగా చేస్తుంది. మోకాలు, మోకాలి చిప్పలు, తొడలు ఈ ఆసనం వల్ల బలాన్ని పుంజుకుంటాయి. ఛాతి భాగాన్ని బలంగా చేయటంతోపాటు హృదయానికి చక్కటి ప్రయోజనం ఈ ఆసనం వలన చేకూరుతుంది.

పైన చెప్పిన ఆసనలన్నీ ముందు మీకు వీలైనంత సమయం చేసి ఆ తరువాత మెల్లిగా సమయం పెంచుకుంటూ పోవాలి అంతేకాని ఒక్కసారే పైన ఇచ్చినంత సమయం ఉండరాదు. యోగా ఎంత మెల్లిగా అబ్యాసం చేస్తే ముందుముందు అంత ప్రయోజనం చేకూరుతుంది. దేశవిదేశాలకు పాకిన యోగా ప్రాధాన్యత స్వదేశంలో కూడా అత్యంత ఆదరణ పొందాలని ఆశిస్తూ..ప్రపంచ యోగా దినోత్సవ శుబాకాంక్షలు.