telugu navyamedia
సినిమా వార్తలు

మండుతున్నరైఫిల్స్‌ ప్రతిధ్వనించడానికి సిద్ధం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్. సెప్టెంబర్‌ 2న పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతుంది.

Bhanu® on Twitter: "Here Is My Design🖤 #BheemlaNayak Is Back On Duty💥😍 #PSPKRanaMovie @PawanKalyan @RanaDaggubati @vamsi84 @SitharaEnts @venupro… https://t.co/vuQJpAamny"

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ భీమ్లా నాయక్. మలయాళ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

PS PK 27 Bheemla Nayak Movie First Look Out Now

చాలాకాలం తర్వాత పక్కా మాస్‌ లుక్‌లో కనిపించిన ఆయన్ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య విడుద‌లైన ఫస్ట్‌ గ్లింప్స్‌కు వచ్చిన స్పందన, అందులో డైలాగ్‌లతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ టీజర్ ఇంతలా ఆకట్టుకోవడానికి దీనికి తమన్ అందించిన సంగీతం కూడా ఓ కారణం అని చెప్పచ్చు. ఈ టీజర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.

Pawan Kalyan, Rana Daggubati starrer Bheemla Nayak's FIRST glimpse takes internet by storm | WATCH | Regional-cinema News – India TV

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2 న‌ భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ‘‘మండుతున్న రైఫిల్స్‌ ప్రతిధ్వనించడానికి సిద్ధమవుతున్నాయి. పవర్‌ అంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్‌ చేసుకుందాం’’ అని ట్వీట్‌ చేశారు దర్శకుడు. ఈ సాంగ్ వింటే… పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే.. అన్నట్టుగా ఈ పాట ఉంటుందని సమాచారం. మరి.. ఈ సాంగ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts