telugu navyamedia
రాజకీయ

మ‌న‌సున్న పోస్ట్‌మాన్‌..

మ‌న‌సుల్లో జెంటిల్‌మాన్ పోస్ట్‌మాన్ , జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్‌మాన్‌.. పోస్ట్‌మాన్ లేని ఊరు వేస్ట్ రా క‌న్నా..! నీ బెస్ట్ ప్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో నాన్న‌.. ప‌ట్ట‌ణాల్లో కైనా ప‌ల్లేలు కైనా వార్త‌లెన్నో మోసుకొచ్చే వార‌దేగా ఈ పోస్ట్ మాన్ అన్న‌ట్టు ఉంది ఈ స్టొరీ..!
ఈ మెయిల్ ..స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాక‌ పెద్ద‌గా పోస్ట్‌మాన్ తో ప‌ని లేక‌పోయింది.. అయితే ఈ రోజుల్లో ఇలాంటి పోస్ట్‌మాన్ ఎక్క‌డా ఉండ‌రు. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 55 ఏళ్ళ వ‌య‌సున్న ఓ పోస్ట్‌మాన్ 25 కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్ళి ఓ వృద్ధ మ‌హిళ‌కు ఫెన్ష‌న్ ఇచ్చి వ‌స్తున్నారంట‌.

టైగ‌ర్ రిజ‌ర్వ్ జంగ‌ల్ లో ఒక‌ రోజంతా న‌డిచి 110 వ‌య‌సున్న వృద్ధ మ‌హిళ‌ల‌కు ఫెన్ష‌న్ ఇవ్వ‌డానికి ప్ర‌తి నెల‌లో ఒక ఆదివారం ఉద‌యం 7గంట‌ల‌కు బ‌య‌లు దేరి న‌ది, కొండ‌లు దాటి ఈ పోస్ట్‌మాన్ ఫెన్ష‌న్ అందిస్తున్నారంట‌. ఐదు నెల‌లు క్రితం ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు.

ఎలా మాట ఇచ్చారు …
ఒక రోజు పాప‌నాశం అనే అప్ప‌ర్ డ్యామ్ బ్రాంచ్‌కు క‌లెక్ట‌ర్ వి.విష్ణు గారు విజిట్ కోసం వెళ్ళారు. క‌లెక్ట‌ర్ గారితో పాటు ఎస్‌. క్రిష్టు రాజు అనే ఈ పోస్ట్‌మాన్ కూడా వెళ్ళారు. అడ‌విలో ఇంజికూజీ అనే మారుమూల గ్రామంలో ఉన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవాడానికి వెళ్ళ‌గా..అక్క‌డ 110 వ‌య‌స్సున్న కుటియ‌మ‌ల్ అనే పేరు గ‌ల వృద్ధ మ‌హిళ ద‌గ్గ‌రు వెళ్ళి నీ ప్ర‌భుత్వం నుంచి ఫెన్ష‌న్ అందుతుందా క‌లెక్ట‌ర్ గారు అడ‌గా..ఆ మ‌హిళ అంద‌డం లేద‌ని చెబుతుంది. దీంతో నీకు నెల‌కు 1000 ఫెన్ష‌న్ ఎలాగైనా అందిస్తాను అని.. ప‌క్క‌నే ఉన్న పోస్ట్‌మాన్ కు ఆ బాధ్య‌త అప్ప చెప్ప‌డం జ‌రుగుతుంది.

దీన్ని ఈజీగా తీసుకోకుండా ఇచ్చిన మాట ప్ర‌కారం ఈ ఫోస్ట్‌మాన్ ఆదివారం ఉద‌యం 7 గంట‌ల‌కు బ‌య‌లుదేరి అడ‌విలో ఉన్న న‌దిలో స్నానం చేసి అక్క‌డే టిఫిన్ తిని బ‌య‌లుదేరి వెళ్ళి ఫెన్ష‌న్ అందిస్తున్నారు. ఈయ‌న చేసిన స‌హాసానికి వృద్ధ మ‌హిళ బందువులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts