m6

అరకులో “ఈ క్షణం”…!?

17

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణ లో విశ్వనాధ్ తన్నీరు, సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎమ్ 6”. ధ్రువ, శ్రావణి, అశ్విని కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జైరామ్ దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ ఈ సినిమా క్వాలిటీలో రాజీ పడకుండా నిర్మించాము. ఈ చిత్రంలోని “ఈ క్షణం” అనే ఒక పాట ఉంది. ఈ పాటను అరకు, మంగళూరులో సుందరమైన లొకేషన్స్ లో చిత్రీకరించాం. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.

దర్శకుడు జైరామ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో సస్పెన్స్ తో పాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగా కుదిరాయి అన్నాడు

హీరో ధ్రువ మాట్లాడుతూ ఇది నా తొలి చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుందీ చిత్రం. ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ఎప్పటికీ ఋణపడి ఉంటా అన్నాడు.