posani-krishnamorali-fire-on-chandrababu

చంద్రబాబు రాజకీయాల్లో బ్రోకర్ పనులు చేస్తున్నారు – పోసాని మురళీకృష్ణ

23

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని మురళీకృష్ణ ప్రెస్ మీట్, చంద్రబాబు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. 23 మంది ఎమ్మెల్యే లను సిగ్గులేకుండా కొనుగోలు చేశాడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యాడు అన్నారు. సీఎం కెసిఆర్ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు విజయవాడ పారిపోయారన్నారు. వైసీపీ కి ఓటు వేస్తె బీజేపీకి ఓటు వేసినట్టు ఎలా అవుతుంది అన్నారు. గతం లో చంద్రబాబు బీజేపీ తో దోస్తి చేయలేదా అన్నారు. కమ్యూనిజం కన్నా టూరిజం గొప్పదని చంద్రబాబు అనడం హాస్యాస్పదం అన్నారు, ప్రధానిలో చంద్రబాబుకు ఏమి మార్పు కనిపించింది అన్నారు, పదవి కోసం చంద్రబాబు ఎవరినైనా చంపుతాడన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కు విలువలు లేవన్నారు, ఎన్టీఆర్ సభ్యులు దీనిని ఖండించాలన్నారు.

చంద్రబాబు గతం లో ప్రత్యేకహోదా అంటే కాళ్ళు విరగొడతా అన్నారన్నారు, ఇప్పుడు యూటర్న్ తీసుకొని మోడీ హోదా ఇవ్వట్లేదంటున్నావ్ అన్నారు, కుల రాజకీయాలు చేయడం లో చంద్రబాబు దిట్టన్నారు. వైఎస్ జగన్ ఫై అందుకు ఆరోపణలు చేస్తున్నావ్ అన్నారు, చంద్ర బాబు ఫై ఉన్నన్ని స్టేలు ఎవరి ఫై లేవన్నారు, రాజకీయం గా బాబు కు ఏవరు అడ్డువచ్చినా వారిని నాశనం చేస్తాడన్నారు, ఇప్పుడున్న నాయకుల్లో వై ఎస్ జగన్ బెస్ట్ అన్నారు. రాజకీయాల్లో సీనియారిటీ కాదు సిన్సియారిటీ ఉండాలన్నారు, ఎన్నికల్లో ప్రజలు మంచి నాయకుడు ని ఎన్నుకోవాలన్నారు. చంద్రబాబు మేకవన్నె పులి అన్నారు, వై ఎస్ జగన్ ఏ విషయానైనా స్పష్టంగా మాట్లాడతారన్నారు, రుణ మాఫీ కంటే మంచి ప్యాకేజి వైస్ జగన్ ఇస్తానన్నారు, చంద్రబాబు రాజకీయాల్లో బ్రోకర్ పనులు చేస్తున్నారన్నారు అని పోసాని విమర్శించారు.