popular brand smart phones

శామ్‌సంగ్‌, షామీలు పాపులర్‌ బ్రాండ్‌లు!

96

ప్రస్తుత జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువుగా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవర్ని చూసినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాల్సిందే. అందుకే మరి రోజుకో కొత్త బ్రాండ్‌, పూటకో కొత్త మోడళ్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎన్ని బ్రాండ్‌లు వస్తున్నా.. మన దేశంలో మాత్రం శామ్‌సంగ్‌, షామీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశంలో ఎక్కువ మంది ఈ బ్రాండ్‌ ఫోన్లనే కొనుక్కోవాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది.

‘ఇండియా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ పర్సెప్షన్స్‌ అండ్‌ క్యారెక్టరిస్టిక్స్‌’ పేరుతో స్ట్రాటజీ అనలిటిక్స్‌ ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. భారత్‌లో శామ్‌సంగ్‌, షామీలు పాపులర్‌ బ్రాండ్‌లుగా నిలిచాయి. కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్‌లకే ఓటేస్తున్నారని నివేదిక పేర్కొంది. ఇక వీటి తర్వాత వన్‌ప్లస్‌ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపింది.

షామీని ‘నమ్మకమైన, సులువుగా ఉపయోగించుకునే’ బ్రాండ్‌గా యూజర్లు పేర్కొనగా.. శామ్‌సంగ్‌ను ‘ఇష్టమైన, మా అవసరాలను అర్థం చేసుకునే’ బ్రాండ్‌గా చెప్పినట్లు నివేదిక వెల్లడించింది.