telugu navyamedia
సినిమా వార్తలు

పూర్ణ ‘బ్యాక్ డోర్’ డిసెంబర్ 3 విడుదల..

హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న సినిమా ‘బ్యాక్ డోర్ . ఈ సినిమాలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు “కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్” అధినేత- ప్రముఖ డిస్ట్రిబ్యూటర్-నిర్మాత కందల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు.

Poorna's Back Door Movie Romantic Teaser | Karri Balaji | MS entertainments - YouTube

ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్సులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, ప్రముఖ నిర్మాత ఆచంట గోపినాధ్, రావణలంక కథానాయకుడు క్రిష్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. “బ్యాక్ డోర్” చిత్రం థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, కథానాయకుడు తేజ త్రిపురాన పాలుపంచుకున్నారు.

కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్” చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు… భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం హక్కుల కోసం పలువురు పోటీ పడినప్పటికీ… నా మీద నమ్మకముంచిన “బ్యాక్ డోర్” నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కర్రి బాలాజీలకు థాంక్స్ తెలియజేస్తున్నాను. దర్శకుడిగా ఈ చిత్రం బాలాజీకి చాలా మంచి పేరు తీసుకురావడం ఖాయం” అన్నారు.

Back Door Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Back Door Movie - FilmiBeat

“అఖండ” చిత్రంలో మంచి పాత్ర పోషించిన పూర్ణ నటించిన “బ్యాక్ డోర్” చిత్రం “అఖండ”తోపాటు విడుదలవుతుండడం నిర్మాతలకు కలిసివచ్చే అంశం. అలాగే… “బ్యాక్ డోర్” చిత్రాన్ని విడుదల చేస్తున్న నెల్లూరు కృష్ణారెడ్డి… బాలయ్యకు వీరాభిమాని కావడం విశేషం. “బ్యాక్ డోర్” కూడా అఖండ ఆదరణ పొందడం ఖాయమని అతిధులు ఆకాంక్షించారు.

Related posts