గతంలో క్యాస్టింగ్ కోచ్ పై జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. అయితే అది ప్రతి చోటా ఉందని వాదించిన వారుకూడా లేకపోలేదు. అది నిజమే అంటుంది ఈ సందర్భం. తాను బాధ్యతగల హోదాలో ఉన్నానన్న సంగతిని మరచిన త్రిపుర మంత్రి ఒకరు, సాటి మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల జరిగిన బీజేపీ ర్యాలీలో రాష్ట్ర మంత్రి మనోజ్ కాంతిదేవ్ మరో మంత్రి సంతను చక్మాతో అనుచితంగా ప్రవర్తించగా, అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐద్వా (ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్) ఆయన రాజీనామా చేయాలంటూ అగర్తలాలో భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టపగలు ప్రధాని పాల్గొన్న సమావేశంలో ఈ తరహాలో వ్యవహరించడం మహిళలను తీవ్రంగా అవమానించడమేనని మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణం మంత్రిని అరెస్ట్ చేయాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో బీజేపీ ఇంకా అధికారికంగా స్పందించకపోవటం విశేషం.
ఏపీ ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు