telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

బీచ్ లో మహిళా పోలీసుల .. టిక్ టాక్ డాన్సులు.. వైరల్

police women steps in tik tok video viral

ప్రభుత్వ ఉద్యోగులు టిక్ టాక్ కు బానిసలైనారని చెప్పకనే చెపుతున్నాయి ఈ తాజా వీడియోలు.. ఇప్పటికే ఇలాంటి వీడియోలు ప్రభుత్వ వ్యవస్థమీద ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని మరింతగా దిగజారుతున్నాయి. డ్యూటీలో ఉండి మరీ ఇలాంటి పనులు అదికూడా ప్రభుత్వ ఉద్యోగులు చేయడంపై పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎప్పటిలాగే వీరిని కొందరు అభినందించడం కొసమెరుపు. డ్యూటీలో ఉన్న ఒత్తిడిని తట్టుకోడానికి ఇలాంటివి అవసరం అంటూ వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారు. డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులు సరదాగా బీచ్‌లో తీన్మార్‌ స్టెప్పులేశారు.

టిక్‌ టాక్‌ మోజులో పడి యూనిఫామ్‌లో ఉన్నామన్న సంగతి కూడా మరిచి.. రొమాంటిక్‌ పాటకు కాలు కదిపారు. దానిని వెంటనే లైక్స్‌ కోసం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశారు. కడలూరు రిజర్వ్ పోలీసు బెటాలియన్ చెందిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సమీపంలోని బీచ్‌లో ఓ తమిళ పాటకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ టిక్ టాక్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాకీ దుస్తుల్లోనే ఇరువురు కానిస్టేబుళ్లు స్టెప్పులు వేయటం పోలీసు అధికారులకు ఆగ్రహం తెప్పించింది. వారిద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts