telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కాల్పుల‌ కేసును రాచకొండ పోలీసులు చేధించారు. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా తేల్చారు. సపారీ గ్యాంగ్ కిల్లర్ నవీన్ కు మట్టారెడ్డి డబ్బులు ఇచ్చి శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర రెడ్డిని హ‌త్య‌ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మట్టారెడ్డి, హఫీజ్, నవీన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే…

అల్మాస్‌గూడకు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి రెండు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో రాఘువేందర్ రెడ్డితో కలిసి పదెకరాల ల్యాండ్ కొన్నాడు. కానీ అప్పటికే ఆ భూమి తనదేనంటూ మట్టారెడ్డి కబ్జా చేశాడు. ఈ విషయంలో వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాస్‌, మరో వ్యక్తితో కలిసి సైట్‌ దగ్గరికి వెళ్లగా, అక్కడే ఉన్న మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మట్టారెడ్డి, అతని అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి పై కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో శ్రీనివాస్‌ రెడ్డి స్పాట్‌లోనే చనిపోయాడు.. రఘుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతణ్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అయితే.. ఇరు కుటుంబాలు కూడా మట్టారెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. అయితే.. మట్టారెడ్డి సుపారీ గ్యాంగ్‌తో ఈ హత్యలు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Related posts