telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బజారయ్య సహకారంతోనే గంజి ప్రసాద్‌ను హత్య..

ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు అయినట్లు ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ..ఈ కేసులో ప్రధాన నిందితుడు బజారయ్యను అరెస్టు చేసినట్లు చెప్పారు.

బజారయ్య సహకారంతో సురేశ్, హేమంత్, మోహన్‌లు కలిసి గంజి ప్రసాద్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్టు పోలీసు విచారణలో తేలింది. గత నెల 26న నిందితుడు సురేష్ కత్తులను సేకరించాడని ఎస్పీ తెలిపారు. రెడ్డి సత్యనారాయణ ఇంట్లో జరిగిన ఓ వేడుకలో గంజి ప్రసాద్ హత్యకు రెక్కీ నిర్వహించాడని తెలిపారు.

ఈ కేసు కు సంబంధించి ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. రెండు బైక్‌లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారుగంజి ప్రసాద్ హత్యలో మరికొందరి ప్రమేయం ఉందని, విచారణ తర్వాత వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రాహుల్‌ దేవ్‌శర్మ తెలిపారు.

Related posts