polavaram-achievements

అనుకున్నదానికన్నా ముందుగానే ‘పోలవరమా’ …?

21
పోలవరంలో అరుదైన రికార్డు సృష్టిచింది నవయుగ కంపెనీ. కేవలం 24 గంటలలో 11 వేల క్యూబిక్ కాంక్రిట్ పనులు పూర్తి చేసింది. దేశంలోనే ఇరిగేక్షన్ ప్రాజెక్ట్ చరిత్రలో ఈ రికార్డు మైలు రాయిగా నిలిచిపోనుంది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు పూర్తి చేసినట్లు నవయుగ కంపెనీ ఎండి శ్రీధర్ తెలిపారు. జులై చివరినాటికి పోలవరంలో 13 వేల క్యూబిక్ కాంక్రిట్ పనులు పూర్తి చేసేందుకు  నవయుగ కంపెనీ ప్రయత్నిస్తుంది. మరో వైవు ప్రాజెక్ట్ పనులు మంత్రి దేవినేని ఉమ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ప్రపంచంలోనే ట్రీ గార్జియస్ ప్రాజెక్ట్ తరువాత అరుదైన రికార్డు ను  పోలవరం సాధిస్తుందని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ను ప్రతి భారతీయుడు గర్వపడేలా నిర్మిస్తాం. దీని కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబు  గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రికార్డు స్థాయిలో 24 గంటలలో 11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు పూర్తి చేసేందుకు ప్రతి సిబ్బంది శ్రమించారని, అధికారులు సహకరించారని నవయువ కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు. 
polavaram-achievements
2019 నాటికల్లా ప్రాజెక్టు ను పూర్తి చేస్తాం అని చెప్తున్నారు, ఈ భారీ టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన నవయుగ కంపెనీ భారీ టెలీబెల్ట్ లను రంగంలోకి దింపింది, ప్రభంచంలో అతిపెద్ద టెలీబెల్ట్ లైన యంత్ర సాయంతో కాంక్రిట్ పనులు చేపట్టింది. గంటలో 180 క్యూబిక్ మీటర్లు కాంక్రిట్ పనులు చేసే టెలీబెల్ట్ తో పాటు  మరో 4 యంత్రాల సాయంతో కాంక్రిట్ పనులు చేపటింది. రోజు 2500 మంది కూలీలు, 500 మంది సిబంది ఇక్కడ విధులు నిర్వహిస్తారు, కాంక్రిట్ పనులు వేగంగా పూర్తవడానికి 5 టెలీబెల్ట్ మిషన్ లను వాడారు. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించిందని ఇరిగేషన్ శాఖ.స్పిల్ ఛానల్స్, స్పిల్ వే పనులు నిర్వహణ నవయుగతో కలసి రికార్డు సృస్తిస్తుంది. దీనికోసం రాత్రి సమయంలో సైతం నిరంతరాయంగా పనులు కొనసాగిచారు. ఒక రికార్డు సృష్టించాలన్న లక్ష్యం తో నిరంతరం పనులు చేసినట్లుగా ఇరిగేక్షన్ అధికారులు చెప్తున్నారు.