telugu navyamedia
రాజకీయ వార్తలు

 చైనా, పాకిస్తాన్ పై పీవోకే వాసుల ఫైర్

china pakistan corona

పీవోకే లో నీలం, జీలం న‌దుల‌పై అక్ర‌మంగా ఆన‌క‌ట్ట‌లు నిర్మిస్తున్నార‌ని చైనా, పాకిస్తాన్ పై పీవోకే వాసులు మండిపడుతున్నారు.  ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చైనా, పాకిస్తాన్ ప్ర‌భుత్వాలు ఈ రెండు న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల కోసం ఏ చ‌ట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నార‌ని నిర‌స‌న‌కారులు ప్ర‌శ్నించారు.

నీలం జీలం, కోహ్లా హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్టులు అక్ర‌మ నిర్మాణాలని అన్నారు. వాటిని ఆపే వ‌ర‌కు అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. పాకిస్తాన్, చైనా నిర్మిస్తున్న‌ ఈ ప్రాజెక్టులు ప‌ర్యావ‌ర‌ణంపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని పేర్కొన్నారు.

ప్రాజెక్టులు ఆపే వ‌ర‌కు నిర‌స‌న‌లు కొన‌సాగుతాయ‌ని పీవోకే వాసులు హెచ్చ‌రించారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద‌ పీవోకేలోని జీలం న‌దిపై హైడ్రో ప‌వ‌ర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు.

Related posts