ఎవరివి నీవు…

26

ఏన్ని జన్మలబందమో నీవు
ఎన్ని వరాల ప్రతిపలము నీవు ఓ నా నేస్తమా
ఏ క్షణములో నీవు నాముందు అలా నిలిచితివో
నీ ప్రియమైన ముఖమును నేను చూసిన వేళ
నా గుండెల్లో కోటివీణలు మ్రోగేను అలా ముద్దు ముద్దుగా
నా కనుల కొలనులో వలపుల పూలు పూచేను అలా హాయి హాయిగా
మనసంతా అలా వలపుల జలపాతములో మునిగితేలేనులే హాయిగా
నీ కలవరింతల్లో నేను లీనమైతినే ఓనా నేస్తమా
నా గుండెల్లో నీరూపే నిలిచింది
నీ నామమే నా గుండెచప్పుడు ఐనది ప్రతి నిమిషo
నీ నామమే జపించుతున్నది నా మది పదే పదే
నీ చక్కని రూపo నీను చూచుటకే వేచివున్నాను ఇలా నేస్తమా

డా..ధనాశి ఉషారాణి