telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

పోక్సో యాక్ట్ ఏమైంది .. వృద్ధురాలి నుండి నెలల పిల్ల వరకు ఎవరిని వదలని .. కామాంధులు..

pocso act doesnot effect still rapes

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 70ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆమె వ్యాపారం కోసం విజయవాడకు వచ్చింది. తిరిగి ఉయ్యూరుకు వెళ్లడానికి రాత్రి పది గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లోని ఎనిమిదో నంబర్‌ ప్లాట్‌ఫాం చేరుకుంది. అక్కడ వేచి ఉండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆమెను మాటల్లోకి దింపారు. అక్కడి నుంచి మెల్లగా ప్లాట్‌ఫాం చివరి వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేశారు. ఆమె వద్ద ఉన్న డబ్బు లాక్కుపోయారు. బాధితురాలు నగ్నంగా రైల్వేట్రాక్‌ పరుగెత్తుకుంటూ రావడాన్ని అక్కడున్నవారు గమనించారు. ఆమె ఒంటిపై వస్త్రాలను కప్పి, పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. 108 అంబులెన్స్‌లో బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్దురాలి మెడపై , చాతిపై, మర్మాంగం నుండి తీవ్ర రక్తస్రావం అవుతుంది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ బ్లేడ్ తో కోసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పట్టాల పై పడి ఉన్న వృద్దురాలి బట్టలు, ఎండు చేపల బుట్టని స్వాదీనం చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

ప్రస్తుతం ఆమె తీవ్రమైన దిగ్భ్రాంతిలో ఉంది. తన పేరు, ఊరు పేరు తప్ప ఇతర వివరాలేమీ చెప్పలేకపోతోంది. కేసును జీఆర్పీ పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. మెడ, మర్మాంగంపై గాయాలున్నాయి. నెత్తురోడుతోంది.ఇది బ్లేడ్‌ బ్యాచ్‌ పని కావచ్చునని అనుమానిస్తున్నారు. మరో ఘటన ఇంకా అమానుషంగా.. తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ప్రవీణ్ అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. కొద్దిసేపటికి మేల్కొన్న పాప తల్లిదండ్రులు చిన్నారి కనిపించకపోయే సరికి కంగారు పడ్డారు. చుట్టుపక్కల ఆచూకీ కోసం చూడగా ప్రవీణ్ చేస్తున్న అఘాయిత్యం కంట పడింది. అప్పటికే చిన్నారి అస్వస్థతకు లోనైంది. చికిత్స నిమిత్తం హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది. ప్రవీణ్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Related posts