telugu navyamedia
రాజకీయ

మోదీ తొలిసారి అమెరికా పర్యటన..

నరేంద్ర మోదీ 1994లో తొలిసారి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళి అక్కడే 40 రోజులు బ‌స‌చేశారు. ఆయ‌న‌న‌తో పాటు కొంత మంది నాయుకులు కూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగం అయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘ది అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ – ఏసీవైపీఎల్’ తరచుగా అమెరికా, ఇతర దేశాల్లోని యువ రాజకీయ నాయకుల ‘ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్’ను నిర్వహిస్తుండేది.

ఇందులో భాగంగానే ..అమెరికాలోని యువ రాజకీయ నాయకులను ఎంపిక చేసిన దేశాలకు పంపించడం, అలాగే.. ఆయా దేశాల్లోని యువ నేతలను అమెరికా ఆహ్వానించడం.. తద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, రాజకీయ, సాంస్కృతిక అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చేస్తుంటామని ఏసీవైపీఎల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే 1994లో భారతదేశం నుంచి ఏడుగురు యువ రాజకీయ నాయకులను ఏసీవైపీఎల్ అమెరికాకు ఆహ్వానించింది.

He will also be the first Indian Prime Minister in over a decade to stay at the US President's guesthouse - the 190-year-old Blair House- when he travels to Washington on his visit.

ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), నరేష్ రావల్ (గుజరాత్), హరిశంకర్ గుప్తా (దిల్లీ), భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ (గుజరాత్), జి కిషన్ రెడ్డి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్), అనంత కుమార్ (కర్ణాటక), జనతా పార్టీ నుంచి బాలసుబ్రహ్మణ్యం (తమిళనాడు)లు ఈ టూర్‌కు ఎంపికయ్యారు…

Flashback Friday: Old pictures of PM Modi's US visit

Related posts