telugu navyamedia
రాజకీయ

గంగానదిలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం..

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోపర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా వారణాసిలోని లలితా ఘాట్‌కు సమీపంలో ఉన్న గంగా నదిలో ప్రధాని మోదీ పవిత్ర స్నానం ఆచ‌రించారు. కాషాయ వస్త్రాలు ధరించిన మోదీ నదిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి.. పూజలు చేశారు. కలశంతో నదిలో పుష్పాలు వదిలారు. కాసేపట్లో కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు.

PM Narendra Modi Takes Holy Dip In Ganga At Lalita Ghat in Varanasi (Watch Video) - Fresh Headline

కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నదీమార్గంలో లలితా ఘాట్​కు బయల్దేరారు. ప్రధానితో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా డబుల్​ డెక్కర్​ పడవలో ప్రయాణించారు.

కాశీ విశ్వనాథ్ కారిడార్ ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోదీ వారణాసికి వెళ్ళారు. మోదీ రాకతో వారణాసి వీధులన్నీ శివనామస్మరణ, మోదీ నామస్మరణతో మారుమ్రోగాయి. వారణాసి వీధుల్లో ర్యాలీగా వచ్చిన మోదీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ.. మోదీ మోదీ, హర్​ హర్​ మహాదేవ్​ అంటూ నినాదాలు చేశారు .

PM Modi: గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ.. కాలభైరవునికి ప్రత్యేక పూజలు | PM Modi takes holy dip in Ganga near Lalita Ghat

ప్రధాని కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభోత్సవం చేయ‌నున్నారు. సోమవారం ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, ఆ తర్వాత కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. కాలభైరవ ఆలయంలో పూజలు నిర్వ‌హించి హారతి సమర్పించారు.

Related posts