telugu navyamedia
రాజకీయ

ప్రధాని మోడీ పర్యటన రద్దు..20నిమిషాలు ఫ్లైఓవర్​పైనే

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన రద్దు అయింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో దాదాపు రూ. 42,750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వెళ్లగా చేదు అనుభవం ఎదురయ్యింది.

బుధవారం మధ్యాహ్నం భటిండా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. అమరవీరుల స్మారకానికి నివాళులర్పించేందుకు బయలుదేరారు. ఈ సమయంలో ప్రధాని కాన్వాయ్‌ను రైతులు అడ్డుకోవ‌డం తో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు నిలిచిపోయింది.

భటిండా ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్రధాని మోడీ ఫెరోజ్‌పుర్ వెళ్లాల్సింది. ఫెరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలా గ్రామంలోని నేషనల్ మార్టిర్స్ మెమోరియల్ వెళ్లాలి. ఫెరోజ్‌పుర్‌లోని బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీలోనూ మాట్లాడాలని షెడ్యూల్ ఉన్నది. కానీ, ప్రధాని మోడీ భటిండా ఎయిర్‌పోర్టు చేరిన తర్వాత అక్కడి నుంచి ఫెరోజ్‌పుర్‌కు హెలికాప్టర్ వెళ్లాలని ముందుగానే నిర్ణయించారు.

కానీ, వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో రహదారి గుండానే కార్ల కాన్వాయ్‌లో ఫెరోజ్‌పుర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఫెరోజ్‌పుర్ వెళ్లక ముందే మధ్యలో రైతు ఆందోళనకారుల ప్రదర్శన కారణంగా ఓ ఫ్లై ఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ సుమారు 15 నుంచి 20 నిమిషాలు నిలిచిపోయింది. ఈ అడ్డగింపుతో ప్రధాని మోడీ ఆ కార్యక్రమాలకు హాజరవ్వకుండా తిరుగు ప్రయాణం అయ్యారు.

Modi punjab visit

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ వెనుదిరిగి దిల్లీకి బయల్దేరారు. భద్రతా లోపాల వల్ల ప్రధాని సభ రద్దయినట్టు బీజేపీ ప్రకటించింది.ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌ అయింది. భద్రతాలోపంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ విషయమై పంజాబ్ సీఎం చరణ్‌జీత్ చన్నీ భారత ప్రధాని భద్రతా చర్యల్లో లోపం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు హెలికాప్టర్‌‌లో వెళ్లాల్సిందని, కానీ, వర్షం కారణంగా ఆయన ప్లాన్ మారిందని అన్నారు. హఠాత్తుగా ఆయన భటిండా నుంచి ఫెరోజ్‌పుర్‌కు కారు కాన్వాయ్‌లో బయల్దేరారని వివరించారు. దీనికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని తెలిపారు. అన్ని దారుల్లోనూ రైతులు ధర్నాలు చేయకుండా కన్విన్స్ చేయడానికి తాను ఉదయం 3 గంటల వరకు పని చేశానని చెప్పారు.

Related posts