telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పేట” ట్విట్టర్ రివ్యూ

Rajanikanth Petta release images

నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పేట” చిత్రం విడుదల అయ్యింది. ఈ చిత్రంలో తలైవా సరసన సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. నేటి ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడగా, చిత్రం చూసిన వారు సినిమా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు.

ఈ చిత్రం గతంలో తెరకెక్కించిన భాషాను మించిపోతుంది అంటుండటం విశేషం. ఇటీవలి కాలంలో వచ్చిన ‘కబాలీ’, ‘కాలా’, ‘2.0’… ఇవన్నీ పాత రజనీకాంత్ ను అభిమానులకు గుర్తు చేయలేకపోయాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ “పేట” మాత్రం 1990 దశకంలో రజనీని గుర్తు చేసిందని అంటున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ సూపరని, ఈ సినిమా రజినీకాంత్ స్టైల్ లో నడిచిన పక్కా మాస్ సినిమా అని అంటున్నారు అభిమానులు. రజినీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు… అభిమానులకు కావాల్సిన వన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని, ఇక క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని తలైవా అభిమానులు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

Related posts