వాహనదారులకు ఏపీ సర్కారు షాకిచ్చింది. పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద. వీటిపై వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచింది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటర్ పెట్రోల్ కు 76 పైసలు, లీటర్ డీజిల్ కు రూ.1.07 పైసలుగా ఉంటుంది.
పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల్ పై 31 శాతం వ్యాట్ తో పాటు 2.76 సర్ ఛార్జీ, డీజిల్ పై 22.25 శాతం వ్యాట్ తో పాటు అదనంగా రూ.3.07 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.