రాజస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. బికనీర్ జిల్లాలోని శ్రీదుంగర్‌గర్హ్ సమీపంలోని జాతీయ రహదారి 11పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు – ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 నుంచి 25 మంది వరకు తీవ్రంగా గాయపడ్దారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.