ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణాజిల్లా స్థానిక పార్టీ ఎన్నికల పరిశీలకులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవం. ప్రభుత్వం ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన పంచాయితీలకు ప్రోత్సాహక నగదును అందిస్తోంది.ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో అశాంతి కలిగించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. గ్రామాల్లో రాజకీయ కక్షలను రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం కుట్ర చేస్తోంది. ఎన్నికల్లో గ్రామాలను నిష్పక్షపాతంగా అభివృద్ధి చేసే అభ్యర్ధులను బలపరచాలి. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళేలా పంచాయతీ పాలకవర్గాలు వుండాలి పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం చేసే అరాచకాలను చట్టపరంగా అడ్డుకునేందుకు కార్యకర్తలు సిద్దంగా వుండాలి. ప్రజాబలంతో ఈ కుట్రలను ఛేదించాలి. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని సూచించారు. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది.
previous post
next post