G Vivek

పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్  కు ఖరారు?

15
2019 ఎన్నికల్లో జరగనున్న  సార్వత్రిక ఎన్నికల్లో   తెరాస పార్టీ  టికెట్ మాజీ ఎంపీ వివేకు ఖరారైనట్టు  ప్రచారం కొనసాగుతోంది.  దీనితో సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ అనుచరుల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.  కాకా తనయులు కారెక్కడంతో పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి అసెంబ్లీ ఈ రెండు స్థానాలను కేసీఆర్  వారికే ఇవ్వనున్నట్లు కార్యకర్తలు  చర్చించుకోవడం గమనార్హం. 
 
ఉద్యమ  సమయంలో తెరాస లో ఉన్న బలమైన నాయకులు వినోద్, వివేకులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో  పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి బల్కా సుమన్ను కేసీఆర్ రంగులోకి  దింపారు.    తెలంగాణ సెంటిమెంట్ తో  వివేక్ పై బాల్క సుమన్ భారీ మెజారిటీ తో గెలుపొందారు. అంతే గాకుండా పెద్దపల్లి ఎంపీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను   కూడా తెరాస ఖాతాలో పడ్డాయి. 
తెరాస అధికారం లోకి వచ్చిన తర్వాత మారుతున్న రాజకీయ సమీకరణాలతో గడ్డం బ్రదర్స్  వినోద్, వివేక్ లు తిరిగి కారెక్కారు.  వీరిద్దరూ తాము ఆశించే  ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల పై కేసీఆర్ నుండి హామీ పొందినట్లు సమాచారం .   
గడ్డం బ్రదర్స్  వినోద్
 
ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీ టికెట్ పై ఆశలు వదులుకొన్నట్లు తెలుస్తోంది.  ఈ మధ్య కాలంలో ఆ ప్రాంతాల్లో పర్యటనలు తగ్గించినట్టు స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ పై నమ్మకo కోల్పోతున్న సుమన్ చొప్పదండి అసెంబ్లీ స్థానము నుండి బరిలో దిగే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.  ఆ నియోజకవర్గంలో  క్యాడర్ ను పెంచుకునేందుకు పావులు కదుపుతున్నట్లు  తెలుస్తోంది.  
TRS MP Balka Suman
 
కాక  కుటుంబానికి కంచుకోటగా ఉన్న పెద్దపల్లి ఎంపీ స్థానం పై ఇప్పటికే  మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు వివేక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంన్నారు.  ఎంపీ పరిధిలోని ఏడు  అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాత క్యాడర్ ను పునరుద్ధరిస్తున్నారు.  తమ స్వంత డబ్బులతో,   విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  గ్రామాల్లో మౌలిక  వసతుల  కల్పన కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.  అటు వినోద్ కూడా బెల్లంపాల్లోకి నియోజక వర్గంలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఆయనకున్న అనుభవంతో సీనియర్ నాయకులతో చర్చించి, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.  రాబోయే సర్ద్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరికి  ఏ నియోజక వర్గాల్లో కేసీఆర్ టిక్కెట్లు  కేటాయిస్తారో వేచి చూడాలి మరి.