telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రాకేశ్‌ రెడ్డిపై పీడీ యాక్టు నమోదు

Chigurupati Jayarammuder case

ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. రాకేశ్‌ రెడ్డి ప్రస్తుతం జయరాం హత్య కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. తాజాగా పీడీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నాడు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు.

ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్‌ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్‌ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. డబ్బు కోసం జయరాంను అతి కిరాతకంగా హత్యచేసి, కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన విషయం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

Related posts