ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం గూగుల్ ప్లే స్టోర్‌లో దర్శనమివ్వడం లేదు. ఐతే పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్, తదితర కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది.
గ్యాంబ్లింగ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘించడంతో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నది. కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో పేటీఎం యాప్‌ను గూగుల్ తొలగించింది. గూగుల్ పాలసీలను పేటీఎం పదేపదే ఉల్లంఘించినట్లు కూడా గూగుల్ గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్లే స్టోర్ నుంచి యాప్ తొలగించడంపై పేటీఎం యాజమాన్యం ట్విటర్లో స్పందించింది. ‘కొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్‌డేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే యాప్ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుంది. యూజర్ల సొమ్ము అంతా పూర్తిగా సురక్షితం. ఎప్పటిలాగే మీ పేటీఎం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు’ అని పేర్కొంది.
తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ఆందోళన: కోడెల