telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక యాత్ర

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు ఆధ్యాత్మిక యాత్రలో పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకోనున్నారు.

మూడు రోజుల ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు తమిళనాడులోని ఏడు క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.

ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం జనసేనాని కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.

Related posts