*కొత్త తరం నాయకులు రాజకీయాల్లోకి రావాలి..
*తెలంగాణలో పరిమిత సంఖ్యలో పోటీ చేస్తామని పవన్ ప్రకటన..
తెలంగాణలో జనసేన జెండా ఎగరాలని , వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులే కీలక పాత్ర పోషించారని, తెలంగాణ రాజకీయాల్లో కూడా విద్యార్ధులు కీలక పాత్ర పోషించాలని కూడా ఆయన కోరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు. నల్లగొండకు బయలుదేరిన పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్దనున్న అక్కపురి చౌరస్తా వద్ద జనసైనికులు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనసేన పార్టీ పటిష్టతకు కృషిచేస్తామని పవన్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రతీ నియోజకవర్గంలో 5 వేల ఓట్లు ఉన్నాయని తెలిపారు.
పోలీసు ఉద్యోగాల వయో పరిమితిని సడలించాలని ప్రభుత్వంతో మాట్లాడుతానని కూడా పవన్ కళ్యాణ్ యువతకు హామీ ఇచ్చారు. యువత బలం జనసేనకు ప్రధాన ఆయుధమని పవన్ కళ్యాణ్ చెప్పారు
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే జనసేన అని స్పష్టం చేశారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని ఓటములైనా భరిస్తామని చెప్పారు. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదని… తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గెలుపు-ఓటములను జనసేన ప్రభావితం చేస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
కాగా… ఇటీవల నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించి… రూ.5 లక్షల భీమా చెక్కును అందజేశారు.
పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్..