పవన్ కళ్యాణ్ ఈ పేరు ఓ బ్రాండ్, పవన్ పేరు వింటేనే అభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. పవన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు రికార్డులు బద్దలవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానిస్తుంటారు. ఇక పవన్ ఫ్యాన్స్‌కు ఆయనపై ఉండే అభిమానం గురించి తెలిసిందే. పవన్ కోరితే ప్రాణాలైన ఇచ్చేస్తారు..
తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే అన్నకు తగ్గ తమ్ముడిగా గుర్తింపు పొందారు. ఇదే క్రమంలో అన్నయ్య చిరంజీవి బాటలోనే పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే పవర్ స్టార్‌గా ఎదిగారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌కు అసలు పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో దాని వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ‘గోకులంలో సీత’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తర్వాత వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్‌లో తొలి విజయాన్ని అందించింది.
ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు కూడా రాశాయి. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేశారు. దీంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అంటూ పిలవడం ప్రారంభించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరి హర వీరమల్లు’తో పాటు హరీష్ శంకర్ సినిమాలతో తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్నారు.
సెప్టెంబర్ 2 వచ్చిందంటే చాలు లక్షలాది మంది అభిమానులను పండగే . ఈ రోజు పవన్ 50వ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో కోలాహలం మొదలైంది. పవన్ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు చేస్తూ తమ అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విశాల్ నన్ను పెళ్ళి చేసుకుంటానని అడిగారు… కానీ…!