telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై పవన్ కళ్యాణ్…

pawan-kalyan

ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారు. కరోనా మూలంగా మార్చి నెల నుంచి విద్యాసంస్థలు మూతపడ్డ క్రమంలో తమకు సెమిస్టర్ పరీక్షల సమాచారం కూడా సక్రమంగా ఇవ్వకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటించి ఏర్పాట్లు చేయడంపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వేల కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు అని పవన్ తెలిపారు .

ప్రతి సెమిస్టర్ లో ఎనిమిది పరీక్షలు ఉంటాయనీ, ప్రస్తుతం స్వస్థలాల్లో ఉన్న విద్యార్థులను మళ్ళీ కాలేజీలు ఉన్న ప్రాంతానికి ఎలా పంపించాలని కన్నవారు ఆవేదన చెందుతున్నారు. సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులు ఏ మేరకు సన్నద్ధమై ఉన్నారో కూడా జె.ఎన్.టి.యూ. వర్గాలకు కూడా సరిగా అంచనాకు రాలేదు. వారి ఆవేదనను సంబంధిత విశ్వవిద్యాలయాలకు చెబుతున్నా స్పందించకుండా పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్ళడం భావ్యం కాదు అని అన్నారు.మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల గురించి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సానుకూలంగా ఆలోచించాలి. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు, ఎన్.ఐ.టీలు సెమిస్టర్ పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానాలను, యూజీసీ మార్గ దర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. సెమిస్టర్ పరీక్షల నిర్వహణను నిలుపుదల చేసి విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలి అనో పవన్ చెప్పుకొచ్చారు .

Related posts