pavan kalyan at narsipatnam

చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయం: పవన్‌

24

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అందరికీ అన్యాయం జరిగిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పోరాటయాత్రలో భాగంగా నర్సీపట్నంలో జరిగిన సభలో పవన్‌ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేస్తారని తెలియక చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు ఆయన తెలిపారు.

చంద్రబాబు దత్తత గ్రామంలో కనీసం మంచినీరు కూడా స్వచ్ఛంగా లేవు. విశాఖ మాన్యంలో ఐటీడీఏ ఉన్నా.. అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. గిరిజన యువకులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వేస్తుంటే.. సీఎంగా మీరేం చేస్తున్నారని చంద్రబాబును పవన్‌ ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. అప్పు ఇస్తానంటే చంద్రబాబు ఏనుగైనా కొంటారని ఎద్దేవా చేశారు. ఇసుక, మైనింగ్‌ మాఫియాలో రాష్ట్రం ముందంజలో దూసుకుపోతోందని పవన్ విమర్శించారు.