pathanjali jeans

మార్కెట్లోకి ‘పతంజలి’ జీన్స్!

76

ఇప్పటికే వివిధ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్న ‘పతంజలి సంస్థ స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ‘పతంజలి’ జీన్స్ మార్కెట్లోకి తీసుకు రానున్నట్టు సంస్థ ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పరిధాన్ బ్రాండ్ కింద తమ సంస్థ దుస్తులను విక్రయిస్తామని, వీటి విక్రయాల కోసం దేశ వ్యాప్తంగా మెట్రో, ఇతర నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

థర్డ్ పార్టీ సహకారంతో తమ సంస్థ దుస్తులను తయారు చేస్తున్నామని, కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మన దేశ వాతావరణ పరిస్థితులు, సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. ‘పరిధాన్’ బ్రాండ్ కింద మార్కెట్లోకి రాబోయే దుస్తుల్లో.. పిల్లల దుస్తులతో పాటు యోగా దుస్తులు, దుప్పట్లు, స్పోర్ట్స్ వేర్, టోపీలు, టవల్స్, బూట్లు..మూడు వేల రకాల వస్తువులను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.