telugu navyamedia
రాజకీయ

పార్ల‌మెంట్ స‌మావేశాలు..కీల‌క బిల్లులు ప్రవేశం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2021, నవంబర్ 29వ తేదీ సోమవార నుంచి ప్రారంభం కానున్న సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి.

ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీల‌క బిల్లులను ప్రవేశపెట్టనుంది.  మొత్తంగా 36 బిల్లులను శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెడుతుండగా.. ఇందులో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దు చేస్తున్నట్లుగా తెలుపుతూ బిల్లు ఆమోదించడం కోసం జాబితా చేయబడింది.

అలాగే, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించడం, న్యాయమూర్తుల జీతాలపై ఒకటి, విద్యుత్ సంస్కరణ బిల్లుదివాలాపై మరొకటి మరియు మానవ అక్రమ రవాణాను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ బిల్లుల‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టనున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు తమ ఎంపీలకు ఈ రోజు హాజరుకావాలని విప్‌లు జారీ చేశాయి.

 

Related posts