telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో టేప్ ..

తెలంగాణ లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికల గురించే అంతటా చర్చ జరుగుతోంది. మునుగోడు బైపోల్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌లో టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎంపీ, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి రెడ్డి ఓ కార్యకర్త మధ్య సెల్‌ఫోన్ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా మాజీ ఎంపీ, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి ఓ కార్యకర్త ఫోన్‌ చేశారు. మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది.

అయితే చల్లమల్ల కృష్ణారెడ్డికి టిక్కెట్‌ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్‌లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా సంభాషణ సాగింది. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే ఊరుకోను” అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్‌ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది

ఈ ఆడియోపై పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ ఆడియోలో తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తనపై కక్షతో కొందరు కావాలనే ఆ ఆడియో క్లిప్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అని.. అతనికి టికెట్‌ ఇస్తే ఓట్లు పడవని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.

Related posts